![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1023లో..... రాజుని ఫాలో అవుతూ వెళ్లిన శృతి అక్కడ చలపతి, లక్ష్మి వాళ్లతో రాజు గురించి అడుగుతుంది. దాంతో వాళ్లు మాకు రాజు దొరికాడని చెప్తారు. అతను దుగ్గిరాల వారసుడు, అచ్చం మా స్వరాజ్ సర్ లాగే ఉన్నారని రాజ్ ఫోటో చూపిస్తుంది శృతి. అచ్చం రాజ్, రాజు ఒకే రకంగా ఉండడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. మా సర్ వాళ్ళు ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్తుంటే వెహికల్ బ్లాస్ట్ అయింది. అందులో అందరు చనిపోయారు. ఒక బాబు ఉండొచ్చు, అతను ఇతనే స్వరాజ్ సర్ వాళ్ళ అక్క కొడుకు అని శృతి చెప్తుంది. మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి.. ఆస్తి కోసం ఇదంతా వాళ్ళ అత్త రుద్రాణి చేసిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటి వారసుడు ఉన్నాడని తెలిస్తే ఆ రుద్రాణి కూతురు రేఖ బ్రతకనివ్వదని వాళ్లకి శృతి చెప్పగానే వాళ్ళు సరే అంటారు.
మరొకవైపు ఐశ్వర్య, రాజు దగ్గరికి వెళ్ళి.. నా డబ్బులు ఎక్కడ అని అడుగుతుంది. లేవు.. ఖర్చు అయ్యాయని రాజు అనగానే ఐశ్వర్య, లక్కీ షాక్ అవుతారు. నువ్వు ఇలా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఐశ్వర్య అంటుంది. మనం ఏం బిజినెస్ చెయ్యలేదు, కిడ్నాప్ చేశాం.. అలా చేస్తే ఎక్కువ ప్రాబ్లమ్ నీకే ఉంటుందని రాజు అనగానే నాకేం చేయాలో తెలుసని ఐశ్వర్య కోపంగా వెళ్తుంది. ఏం చేస్తున్నావ్ రా అని లక్కీ అడుగుతాడు. నేనే ఖర్చు చేసుకున్నాను అన్నాను కదా అని రాజు అంటాడు. ఆ తర్వాత రేఖ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఇందుని వేలిముద్ర వెయ్యమని చెప్తుంది, దాంతో ఇందు వేలిముద్ర వేస్తుంది. ఎందుకు ఇలా చేశావని ఇందుపై అపర్ణ, సుభాష్ కోప్పడతారు. నువ్వు తప్పు చేశావ్ అక్క అని స్వాతి అంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు ఎందుకంటే ఆ వేలిముద్ర చెల్లదని ఇందు అనగానే సుభాష్, అపర్ణ, స్వాతి షాక్ అవుతారు.
మరొకవైపు ఇందు వేలిముద్ర వేసిన పేపర్స్ ని తీసుకొని రేఖ, భూషణ్ ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్తారు. ఈ వేలిముద్ర చెల్లదని లాయర్ చెప్పగానే ఎందుకు చెల్లదు. అది ఇందునే పెట్టింది కావాలంటే మీ ముందే పెట్టిస్తామని భూషణ్ అంటాడు. నా ముందు పెట్టినా చెల్లదు ఎందుకంటే ఇందు వాళ్ళ అమ్మనాన్న వాళ్ళు చనిపోకముందు నా దగ్గరికి వచ్చి తన కూతురికి పెళ్లి అయ్యాకే తన ఆస్తులన్నీ తన పేరున మారాలని వీలునామా రాశారని లాయర్ అనగానే రేఖ, భూషణ్ షాక్ అవుతారు. తరువాయి భాగంలో ఇందుకి పెళ్లి చేయాలని రేఖ పంతులుని పిలిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |